భారతీయ సినిమాలో దిక్షిణాది చిత్రాలకే అగ్రతాంబూలం దక్కేలా చేసిన దర్శకులు శంకర్, రాజమౌళి. ఇద్దరి లక్ష్యం ఇండియన్ సినిమా హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోదని ప్రపంచానికి చాటిచెప్పడమే. అయితే ఆ విషయంలో నూటికి నూరు శాతం శంకర్ కంటే రాజమౌళే ముందున్నాడని చెప్పకతప్పదు. పగా ప్రతీకారాల నేపథ్యం వంటి మామూలు రొటీన్ కథనే ఎంచుకున్నా దానికి సగటు ప్రేక్షకుడు రోమాంచితంగా ఫీలయ్యే బలమైన భావొద్వేగాల్ని జోడించి `బాహుబలి` సిరీస్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు జక్కన్న. బాహుబలి సిరీస్‌లు అనూహ్య విజయాన్ని సాధించి భారతీయ సినీ చరిత్రకు కొత్త అధ్యాయాన్ని లిఖించాయంటే అది రాజమౌళి మార్కు ఎమోషనల్ గేమ్ ఫలితమే. దాన్ని పాటించలేని శంకర్ ఎన్ని కోట్లతో సినిమా చేసినా... ఎంత గ్రాఫిక్స్ జిమ్మిక్కులు చేసినా ఆ స్థాయి ఫలితాన్ని సాధించలేకపోయాడనే అనే వాదన ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తోంది.
శంకర్ లేటెస్ట్ వండర్ `2.ఓ` ఈ 29న విడుదలైన విషయం తెలిసిందే. సినిమా చూసిన వారంతా కథ బాగుందని చెప్పడం లేదు. కథలోని ఎమోషన్స్ పండాయని చెప్పడం లేదు. కేవలం గ్రాఫిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదీ కూడా కొన్ని సన్నివేశాల్లోనే అని పెదవి విరుస్తున్నారు. శంకర్ స్థాయిలో సినిమా లేదని, కథని పక్కన పెట్టి సాంకేతికను నమ్ముకుని సినిమా చేశాడని, అందుకే సినిమాలో ఫీల్ మిస్సయిందని చెబుతున్నారు. ఈ సినిమాకు రాజమౌళి మార్కు ఎమోషన్స్ తోడైతే సినిమా ఎక్కడో వుండేదని, నాలుగేళ్లు శ్రమించి సరికొత్త స్ట్రాటీతో బాహుబలి సిరీస్‌లను ప్రపంచం ముందకు విజయవంతంగా తీసుకొచ్చి దర్శకధీరుడిగా రాజమౌళి జేజేఅందుకుంటే అదే స్థాయిలో `2.ఓ` సినిమా కోసం నాలుగేళ్లు శ్రమించిన శంకర్ మాత్రం రాజమౌళిలా మ్యాజిక్ చేయలేకపోయాడని సినీ వర్గాలతో పాటు సగటు ప్రేక్షకుడు ఫీలవుతున్నాడు. `రోబో` మూడవ సిరీస్‌లో రెండవ భాగంలో మిస్సయిన కథని, ఎమోషన్స్‌ని మిస్సవకుండా చూస్తాడేమో చూడాలి.
from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2AAdYkq
Comments
Post a Comment