జగన్‌కు భయపడి.. బాలయ్య వెనక్కి..!

తెలుగు సినీ ప్రేక్షకులే గాక రాజకీయపరంగా కూడా ఓటర్లు దేవుడిగా కొలిచే దేవుడు స్వర్గీయనందమూరి తారక రామారావు. నాడు ఆయన రాజకీయాలలో ఉండగా, ఆయనపై వచ్చిన పలు పుకార్లు, ఆయన వేషధారణ, మాట్లాడేతీరు వంటివి చూసి కృష్ణ వంటి వారు ఆయనపై వ్యంగ్యాస్త్రాలైన చిత్రాలను తీశారు. నాడు ఎన్టీఆర్‌ క్షుద్రపూజలు చేస్తాడని, అర్ధరాత్రులు శవాలపై కూర్చుని మంత్రాలు జపిస్తాడని, ఒకసారి వివేకానందుని గెటప్‌, మరోసారి మరొకరి గెటప్‌లు వేసుకుంటూ జనాలను అమాయకులను చేస్తాడని, తాను సంపాదించిన కోట్లాది రూపాయలను పిల్లలకు పంచి ఆ తర్వాత నా దగ్గరేముంది బూడిద అంటూగిమ్మిక్‌లు చేసేవాడని, నెలకి జీతం రూపాయే తీసుకుంటానని పబ్లిసిటీ స్టంట్స్‌ చేసేవాడని, గండిపేట రహస్యాలు చాలా ఉన్నాయని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ చిత్రాలు రూపొందాయి. ఇవి నిజానికి చాలామంది నిజమేనని నమ్మారు కాబట్టి ఓ మోస్తరు ప్రజాదరణ లభించింది. 

ఇక తాము నిజంగా అభిమానించే నాయకుల చరిత్రలను తప్పుగా చూపినా ప్రేక్షకులు సహించరు. అదే తనతండ్రి ఎన్టీఆర్‌కి నీరాజనంగా క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ తీసిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల ఫలితాలు వెల్లడించాయి. ఇక ఎన్టీఆర్‌ తర్వాత జననేతగా ఎంతో పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి. ఇప్పటికే చాలా మంది వైఎస్‌ని తప్పుగా చూపించాలని భావించినా ప్రజల ముందు నిరాదరణకు గురవుతామనే భయంతో మౌనంగా ఉండి పోయారు. 

ఇక విషయానికి వస్తే తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలైంది. ఈ స్థాయి ఓటమిని, కేవలం తమను 23 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం చేయడాన్ని ఆ పార్టీనాయకులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టిడిపిని చిత్తుగా ఓడించిన జనం ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ వైసీపీకి 151స్థానాలను కట్టబెట్టారు. మొత్తం పార్లమెంట్‌ స్థానాలలో టిడిపికి లభించింది రెండు మాత్రమే. అవి కూడా పోలింగ్‌ సిబ్బంది, ఉద్యోగుల పొరపాటు వల్ల టిడిపి దక్కించుకుంది. ఉద్యోగుల తప్పిదం, పోస్టల్‌ బ్యాలెట్లకు సీరియల్‌ నెంబర్‌వేయని కారణంగా ఆ ఓట్లు మురిగిపోవడం వల్లనే గుంటూరు నుంచి మహేష్‌బావ గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్‌నాయుడు గెలుపొందారు. ఇక చంద్రబాబు, బాలయ్యలు గెలవడం ఒక్కటే టీడీపీకి ఓదార్పు కానీ బాలయ్య ఇద్దరు అల్లుళ్లు నారాలోకేష్‌, భరత్‌లు ఘోర ఓటమి పాలయ్యారు. ఈ సోది అంతా ఎందుకు అంటే ఇక్కడే అసలు విషయం ఉంది. 

బాలకృష్ణ ‘కథానాయకుడు, మహానాయకుడు’లతో చరిత్రను తప్పుదోవ పట్టించి దెబ్బతింది పోయి.. తన తదుపరి చిత్రంగా తనతో ‘జైసింహా’ చిత్రం తీసిన తమిళ సీనియర్‌ దర్శకుడు కె.యస్‌.రవికుమార్‌, సి.కళ్యాణ్‌లతో ఓ చిత్రం ప్లాన్‌ చేశాడు. దీనికి ‘రూలర్‌’ అనే టైటిల్‌ని కూడా అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో బాలయ్య వైఎస్‌రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలను విలన్లుగా చూపిస్తూ, ఈ రెండు పాత్రలను జగపతిబాబు చేత వేయించాలని ప్లాన్‌చేశాడు. కానీ వైసీపీకి ప్రస్తుతం ఉన్న ప్రభంజనం చూసిఈ సమయంలో ఇలాంటి చిత్రం చేయడం సరికాదని ఆ చిత్రాన్నిపక్కన పెట్టాడని తెలుస్తోంది. మరి ఆ స్థానంలో తనకోసం ఎదురుచూస్తోన్న ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రానికి బాలయ్య ఓకే చెబుతాడేమో వేచిచూడాల్సివుంది...! 



from Telugu Unicode News feed from Cinejosh.com http://bit.ly/2VYP5Ys

Comments