ఈ సారి పార్టీ చిరు ఇంట్లో.. విషయం ఏంటంటే!

దక్షిణాది చిత్ర పరిశ్రమల నుండి 1980, 1990ల కాలంలో వెండితెరకు చాలా మంది నటీనటులు పరిచయం అయ్యారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ , కోలీవుడ్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌, మలయాళ టాప్ హీరో మోహన్‌ లాల్‌ లాంటి స్టార్స్‌ ఈ జనరేషన్‌కు చెందిన వారే. వీరితో పాటు అందాల భామలు రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బూ, సుమలత, సుహాసిని, నదియా లాంటి వారు కూడా ఈ జనరేషన్‌ హీరోయిన్లే. అయితే వీరంతా ప్రతీ ఏటా ఓ చోట కలిసి పార్టీ చేసుకోవటం చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఏదో ఒక థీమ్‌ను ఎంచుకొని అందుకు తగ్గట్టుగా అందరూ రెడీ అయ్యి ఓ రోజంతా తమ కెరీర్‌ తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ సరదాగా గడుపుతుంటారు స్టార్స్‌. ఈ ఏడాది కూడా అలాంటి రీ యూనియన్‌ పార్టీకి రంగం సిద్ధమవుతోంది. Also Read: అయితే ఈ సారి ఆ పార్టీని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేయనున్నారట. సైరా నరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మెగాస్టార్‌ ఆ ఆనందాన్ని తన జనరేషన్‌ స్టార్స్‌తో పంచుకునేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ సారి పార్టీని మెగాస్టార్‌ ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీని మెగాస్టార్‌ ఇంట్లో ఏర్పాటు చేయడానికి మరో కారణంగా కూడా ఉంది. చిరు ఈ మధ్యే తన ఇంటిని రినోవేట్ చేయించాడు. అధునాతన వసతులతో మరింత అందంగా తీర్చి దిద్దాడు. తన కొత్త ఇంటిని తన సన్నిహితులకు చూపించాలన్న ఉద్దేశంతో కూడా పార్టీని తన ఇంట్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. Also Read: ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్‌ హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ఈ నెల 2వ తేదిన విడుదలై ఘనవిజయం సాధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ నటుడు సుధీప్‌, తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు, చిరు సరసస నయనతార, తమన్నాలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాన్‌ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఇప్పటికే దాదాపు 280 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌ చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JmpXYf

Comments