కన్నడ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్లు గల్రాని, ద్వివేది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సంజన, రాగిణికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్) కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరికొంత మంది బెయిల్ పిటిషన్లను ఈరోజు (సెప్టెంబర్ 30న) కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివప్రకాష్, వినయ్ కుమార్‌ల యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. అలాగే, ఈవెంట్ మేనేజర్ విరేన్ ఖన్నా, వ్యాపారవేత్త ప్రశాంత్ రంక, టెకీ ప్రతీక్ శెట్టి, మోడల్ నియాస్ మహమ్మద్, బులియన్ ట్రేడర్ వైభవ్ జైన్‌ల బెయిల్ పిటిషన్లను కోర్టు వాయిదా వేసింది. ఖన్నా బెయిల్ పిటిషన్ విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేయగా మిగిలిన వారందరి పిటిషన్లను ఈరోజు విచారించనుంది. కాగా, బెయిల్ కోసం సంజన, రాగిణి హైకోర్టుకు వెళ్లనున్నట్టు డిఫెన్స్ అడ్వకేట్స్ వెల్లడించారు. ‘‘ఆర్డర్స్ కాపీల కోసం మేం దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన తరవాత కొన్ని రోజుల్లో హైకోర్టును ఆశ్రయిస్తాం’’ అని చెప్పారు. డ్రగ్ కేసులో సంజన గల్రాని, ఆమె తల్లి ప్రమేయం ఉందని గుర్తించిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు.. సెప్టెంబర్ 9న వారిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం చమ్రాపేట్‌లో ఉన్న సీసీబీ కార్యాలయానికి తల్లీకూతుళ్లను తరలించారు. అంతకుముందే సెప్టెంబర్ 7న రాగిణిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్‌తో పాటు మరికొంత మంది నటీనటులను సీసీబీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం గురించి లంకేష్ కీలక విషయాలు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3495OhU
Comments
Post a Comment