మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా అనుభవించి ఆపై గర్భనిరోధక మాత్రలను నమ్మించి సైనైడ్ ఇచ్చి చంపేసిన మోహన్ అనే సైకో కిల్లర్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన మోహన్ ఏకంగా 2003 - 2009 కాలంలో ఏకంగా 20 మంది మహిళలను కనికరం లేకుండా చంపేశాడు. న్యాయస్థానం అతడికి ఆరు మరణశిక్షలు, 14 జీవితఖైదులు విధించింది. ఈ కేసు ఆధారంగా దర్శకుడు రాజేశ్ టచ్రివర్ ‘సైనైడ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీలో పాన్ ఇండియా మూవీగా ప్రదీప్ నారాయణన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నారు. హిందీలో ఆ పాత్రను యశ్పాల్ శర్మ పోషిస్తారని దర్శకుడు రాజేశ్ తెలిపారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత ప్రదీప్ నారాయణన్ వెల్లడించారు. తనికెళ్ల భరణి, సమీర్, రోహిణి, చిత్రంజన్ గిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి జార్జ్ జోసెఫ్ సంగీతం అందించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సంచలనాత్మక కేసు ప్రేరణతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో ప్రియమణి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు’ అని తెలిపారు. ‘‘20 మంది మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా లొంగదీసుకుని ఆ తర్వాత హత్యలకి పాల్పడిన మోహన్ కథే ఈ సినిమా. జనవరి నుంచి షూటింగ్ స్టార్ అవుతుంది. బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jkhKDE
Comments
Post a Comment