అందాల నటుడు భౌతికంగా లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఆంధ్ర సోగ్గాడు చిరస్థాయిగా నిలిచిపోయారు. తనను అందంగా చూసిన ప్రేక్షకులు ముసలితనంగా చూడలేరన్న భావనతో స్వచ్ఛందంగానే సినిమాలకు స్వస్తి పలికారాయన. కాలేజీలో చదువుతున్నప్పుడే శోభన్‌బాబుకు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలంటే పిచ్చి. కాలేజీకి డుమ్మా కొట్టి మరీ సినిమాలు చూసేవారంట. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘కీలుగుర్రం’ ఆయన చూసిన మొదటి సినిమా. మల్లీశ్వరి సినిమాను ఏకంగా 22సార్లు చూశారంట. డిగ్రీ పూర్తయ్యాక మద్రాసులో లా కోర్సులో జాయిన్ అయిన ఖాళీ సమయాల్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు.
1959లో ఎన్టీఆర్‌తో ‘దైవ బలం’ అనే సినిమాలో మొదటగా నటించారు. ఆ తర్వాత భక్త శబరి, భీష్మ, అభిమన్యు, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, మనుషులు మారాలి, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం, డాక్టర్ బాబు, సోగ్గాడు, గోరింటాకు, శ్రావణ సంధ్య, దేవత, కార్తీకదీపం, ముందడుగు, మహాసంగ్రామం స్వయంవరం, సంపూర్ణ ప్రేమాయణం, సంసారం, సర్పయాగం లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడిగా నిలిచిపోయారు. కోడె త్రాచు, ఇల్లాలు ప్రియురాలు వంటి చిత్రాలతో కోదండరామిరెడ్డి, శోభన్‌బాబు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చేసినప్పటికీ శోభన్‌బాబు మద్రాసులోనే ఉండిపోయారు. ఓసారి కోదండరామిరెడ్డి మద్రాస్ వెళ్లినప్పుడు శోభన్‌బాబును కలిశారట. ఏంటి సినిమాలు చేయడం లేదు.. నీ అభిమానులు ఫీలవుతున్నారు.. అని కోదండరామిరెడ్డి అడిగారట. అందుకు ఆయన స్పందిస్తూ..‘ ఆ అందాల నటుడు శోభన్‌బాబు ఎప్పుడో చనిపోయాడు. జుట్టు ఊడిపోయి, ముడతలు పడిన శరీరంతో నేను తెరపై కనిపించడం ఇష్టం లేదు. అందుకే ఇంట్లో ఉండాలనుకుంటున్నారు. నా అభిమానులు వచ్చినప్పుడు కూడా... ‘నేనింక సినిమాల్లో నటించను, ఎంతో దూరం నుంచి నా కోసం రాకండి’ అని చెప్పేశానంటూ కోదండరామిరెడ్డితో చెప్పారంట శోభన్‌బాబు. Also Read:from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oCVKXT
Comments
Post a Comment